జనసేన అధికార పత్రిక ‘శతఘ్ని’ విడుదల

682

జనసేన పార్టీ సిద్దాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పక్ష పత్రిక ‘శతఘ్ని’ని విడుదల చేశారు. పార్టీ శ్రేణులకు సిద్దాంతాలపై అవగాహన కల్పించడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపిక ఉంటుందని ఆపార్టీ చెబుతోంది. జనసేన సంకల్పం గురించి ప్రతి పాఠకుడికి తెలియచేసేలా శతఘ్ని పత్రిక ఉండబోతుందని నేతలు తెలిపారు.

జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ “బలమైన సిద్దాంతాలు ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన. టీడీపీ, వైసీపీలకు సిద్దాంతాలు లేవు. అధ్యక్షులు పవన్ ఏడు సిద్దాంతాలను మనకు అందించారు. అవినీతిరహిత సమాజం స్థాపనే లక్ష్యంగా జనసేన ముందుకు వెళ్తుంది. అలాగే మన పార్టీకి సంబంధించిన విషయాలను తెలియచేసేందుకు ‘శతఘ్ని’ పేరుతో పక్ష పత్రికను తీసుకువస్తున్నాం. పార్టీ శ్రేణులకు డిసెంబర్ నెలాఖరుకి 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలనీ లక్ష్యంగా నిర్ణయించాం. అలాగే ఈ నెలలోనే ‘వాడవాడ జనసేన జెండా’ అనే కార్యక్రమం నిర్వహించనున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here