ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమ న్యాయపరమైన హక్కులపై సానుకూలంగా స్పందించారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈరోజు వెంకయ్యతో భేటీ అనంతరం మాట్లాడిన ఆయన ఏపీకి న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తాము దశల వారీగా పోరాటం చేస్తున్నామని, ఇకముందు చట్టపరంగా కూడా ముందుకు వెళ్లనున్నట్లు ఎంపీ గల్లా చెప్పారు. ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here