భారతీయ చలన చిత్ర రంగంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం మంచి హిట్ అయ్యింది. ఆ చిత్రం విడుదలకు ముందు ఎన్నో వివాదలు సృష్టించింది. తాజాగా కమలహాసన్ కథానాయకుడిగా ‘విశ్వరూపం 2’ రూపొందింది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ చిత్రం తెలుగు .. తమిళ భాషల్లో విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో పూర్తై రిలీజ్ కావాల్సి ఉన్నా..మద్యలో కొన్ని అవాంతరాలు రావడంతో ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఎన్నో అవాంతరాలు దాటి ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుకను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా వదిలారు. అయితే కమల్ హాసన్ ఈ చిత్రంలో నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ వేడుకలో కమల్ హాసన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments