టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిప్పులు చెరిగారు. రైతు బంధు పథకం అంటూనే.. రైతులకు సంకెళ్లు వేస్తోందని ధ్వజమెత్తారు. పాస్ బుక్ అడిగిన పాపానికి హుజూరాబాద్‌లో రైతు రాజయ్యకు సంకెళ్లు వేశారని ఆరోపించారు. రాజయ్య ఏం పాపం చేశాడని సంకెళ్లు వేశారో.. డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లంచం అడిగితే చెప్పుతో కొట్టమని గతంలో కేసీఆర్ చెప్పలేదా? అని వీహెచ్ గుర్తుచేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు రైతులకు సంకెళ్లు వేసిన రికార్డ్ లేదన్నారు.

సింహం సింగిల్‌గా వస్తోందని అంటున్న కేటీఆర్‌కు సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నప్పుడు సింహం గుర్తుకురాలేదా? అని నిలదీశారు. పండుగలను ప్రభుత్వం హైజాక్ చేస్తోందని మండిపడ్డారు. ఎంపీ కవిత బోనం ఇస్తే.. అందరూ ఇచ్చినట్లేనా?

అని అడిగారు. రంగంలో స్వర్ణలత, జోగిని శ్యామల చెప్పినట్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని వీహెచ్ హెచ్చరించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments