కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో రోజా మాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments