శతమానం భవతి లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రమిది. నందిత శ్వేత, ప్రకాశ్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ని ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. రేపు అంటే ఆగస్ట్ 2న ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు.ఇంకో విషయం ఏమిటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. బేసిగ్గా నితిన్ సినిమాలకు సంబధించిన ప్రమోషన్ లో ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటారు. పవన్ చేతుల మీదగా నితిన్ ఆడియోలు , టీజర్లు రిలీజ్ అవుతూవుటుంటాయి. కాని ఇపుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఈసారి మహేష్ ని సంప్రదించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments