టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ సొల్లు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనైనా 20 సీట్లకు మించి గెలవగలదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణ వాళ్లే అని అంటున్నామని, కాంగ్రెస్ వాళ్లు సెటిలర్లని విడదీసి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. విభజన హామీలపై కేంద్రంతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నామని చెప్పారు. అమేథీలో మున్సిపాలిటీ గెలిపించుకోలేని రాహుల్‌గాంధీ, తెలంగాణకు వచ్చి పొడిచేదేమీ లేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం కాదు… శబ్ద విప్లవమే ఉంటుందని కేటీఆర్ అన్నారు.
ఉత్తమ్ సొల్లు మాట్లాడుతున్నారు
Subscribe
Login
0 Comments