బ్రహ్మాండమైన చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు దర్శకుడు శంకర్‌. ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్నారు. అవినీతి, లంచగొండితనంపై శంకర్‌ రూపొందించిన బ్రహ్మాస్త్రాలు సినీ పరిశ్రమకే గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ తర్వాత కమల్‌తో ‘ఇండియన్‌’ను రూపొందించి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘కాదలన్‌’, ‘జీన్స్‌’, బాయ్స్‌’ వంటి చిత్రాలతో అద్భుతమైన ప్రేమ కావ్యాలను రూపొందించగలనని చాటిచెప్పారు. తన కలల ప్రాజెక్టు అయిన ‘రోబో’ సినిమాను రజనీకాంత్‌తో రూపొందించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా యావత్‌ సినీ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు. తాజాగా రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌లతో ‘2.ఓ’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కమల్‌హాసన్‌తో ‘ఇండియన్‌ 2’ కూడా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఇదిలా ఉండగా జెంటిల్‌మెన్‌తో ప్రారంభించిన ఆయన సినీ ప్రస్థానం దిగ్విజయంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన శిష్యగణం సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. శంకర్‌ వద్ద శిష్యరికం చేసిన మాదేష్‌, బాలాజీ శక్తివేల్‌, వసంతబాలన్‌, అరివళగన్‌, అట్లితో పాటు పలువురు కలిసి శంకర్‌కు ఓ జ్ఞాపిక అందజేశారు. తన గురువుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తమ అనుబంధాన్ని పంచుకున్నారు.

దీనిపై శంకర్‌ స్పందిస్తూ ‘నా సహాయ దర్శకులు చూపుతున్న అమితమైన ప్రేమ వర్షంలో తడిసి ముద్దయ్యాను. వాళ్లు లేకుండా నా పయనం సాగేది కాదు’ అని పేర్కొన్నారు. ఈ 25 ఏళ్ల కెరీర్‌లో శంకర్‌ కేవలం 12 చిత్రాలు మాత్రమే రూపొందించినప్పటికీ.. 100 చిత్రాల క్రెడిట్‌ను ఆయన సొంతం చేసుకున్నారని శిష్యగణం చెబుతోంది.

శంకర్‌ దర్శకత్వంలోని ‘2.ఓ’ చిత్రం నవంబరు 29న విడుదలవుతున్న విషయం తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments