వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. జననేత వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ రాజన్నతనయుడు ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం మీదుగా పిఠాపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. పిఠాపురంలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
225వ రోజు కు ప్రజాసంకల్పయాత్ర
Subscribe
Login
0 Comments