పోలవరం విజ్ఞాన యాత్రకు స్పీకర్ కోడెల శివప్రసాద్ శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం వేలాది మంది రైతులతో కలిసి స్పీకర్ కోడెల శివప్రసాద్ పోలవరం యాత్రకు బయలుదేరి వెళ్లారు. స్పీకర్ ఆధ్వర్యంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి రైతులు 60బస్సులు, 100కార్లలో పోలవరంకు పయనమయ్యారు.  ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆంధ్రా ప్రజల చిరకాల కోరిక పోలవరమన్నారు. పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని అందుకోసమే పోలవరం సందర్శన యాత్ర చేపట్టినట్లు చెప్పారు.రైతుల కష్టాలను తీర్చడానికి పోలవరం నిర్మిస్తున్న ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, దివ్యాంగుల కార్పోరేషన్ ఛైర్మన్ కోటేశ్వరరావు, సాగర్ కెనాల్ డెవలప్‌మెంట్ అధ్యక్షుడు రాయల్ , టీడీపీ నేతలు సుఖవాసి, బుజ్జి హాజరయ్యారు.
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments