నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ విషయమై తనపై చేసిన అలిగేషన్స్ విషయంలో లారెన్స్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసిన ఆయన ఈ ఇష్యూని ఏడు సంవత్సరాల క్రితం ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. అంతే కాకుండా శ్రీరెడ్డిని ప్రెస్‌మీట్‌కు రావాలంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

”హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నేను ట్రస్ట్‌ని ప్రారంభించి 13 సంవత్సరాలవుతోంది. మీ సపోర్ట్‌తో అది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మీ సపోర్ట్‌కి, బెస్లింగ్స్‌కి థాంక్స్. మరో విషయం ఏంటంటే, నేను శ్రీరెడ్డి విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నేను రెబల్ మూవీ చేసి 7 సంవత్సరాలు పూర్తైంది. ఆమె 7 ఏళ్ల క్రితం ఈ ఇష్యూని ఎందుకు బయటపెట్టలేదు? సరే వదిలేయండి. ఆమె నా హోటల్ రూమ్‌కి వచ్చానని… అప్పుడు నేను ఆమెను మిస్ యూజ్ చేసుకున్నానని తెలిపింది. నా రూమ్‌లో దేవుడి ఫోటో, రుద్రాక్ష మాల కూడా చూశానని ఆమె చెప్పింది. హోటల్స్‌లో రుద్రాక్ష మాల పెట్టి పూజలు చేయడానికి నేనేమీ ఫూల్‌ని కాను. నేను శ్రీరెడ్డికి డైరెక్ట్‌గా చెబుతున్నా.. నేనే తప్పూ చేయలేదు ఆ విషయం నాకు తెలుసు.. ఆ భగవంతుడికి తెలుసు. నువ్వింత చేశాక కూడా నాకు నీపై కోపం రావట్లేదు. నీ ఇంటర్వ్యూస్‌ అన్నీ చూశాను.. నీపై జాలి కలుగుతోంది నాకు.

ఇప్పుడసలు నిజంగా నీ ప్రాబ్లమ్ ఏంటి? నీకు ఛాన్స్ ఇప్పిస్తామని ప్రతి ఒక్కరూ నిన్ను మోసం చేశారనే కదా. నువ్వొక మంచి నటివని చెప్తున్నావు కదా.. మేమొక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తాం.. దానిలో నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు. మీడియా ముందు నీకో క్యారెక్టర్, సీన్ ఇస్తా నటించి చూపించు అలాగే కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూపిస్తా అవి చేసి చూపించు.. అంటే దానర్థం నేనేదో కష్టమైన స్టెప్స్ ఇస్తాను అని కాదు. నేను చాలా సింపుల్ స్టెప్స్, డైలాగ్స్ ఇస్తా.. అవి కూడా నటులకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీకి సంబంధించినవి మాత్రమే. నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే నా ఎదుట, ప్రెస్ ఎదుట అవి చేసి చూపించు. నిజంగా నువ్వు బెస్ట్ యాక్టర్‌వి అని నేను ఫీల్ అయితే ఓ డైరెక్టర్‌గా ప్రెస్ ఎదుట నా నెక్ట్స్ మూవీలో నీకో మంచి క్యారెక్టర్ ఇచ్చేందుకు సైన్ చేసి.. అడ్వాన్స్ ఇస్తాను.

నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి నిన్ను డైరెక్ట్‌గా ఫేస్ చేసేందుకు నేను భయపడట్లేదు. నీవు నా సినిమాలో నటించినట్లైతే నీకు చాలా ఛాన్సులు వస్తాయి. నీవు ప్రతి ొక్కరి ముందు నటించాలంటే ఫీల్ అయితే నువ్వు నా మేనేజర్‌ని కాంటాక్ట్ అవ్వు. నీ లాయర్‌ని, నీ మంచికోరేవారిని వెంట తెచ్చుకుని నీ యాక్టింగ్ టాలెంట్‌ని చూపించు నేను తప్పకుండా సాయం చేస్తా. నేను భయపడిన కారణంగా ఈ రిప్లై ఇవ్వట్లేదు నేను మహిళలకు చాలా గౌరవం ఇస్తాను అందుకే నా తల్లికి గుడికట్టి అది మహిళలకు డెడికేట్ చేశాను. మంచి మాట్లాడుకుందాం.. మంచి పనులు చేద్దాం. నీకు మంచి జీవితం లభించాలని నేను ప్రార్థిస్తాను” అంటూ ట్వీట్ చేశారు లారెన్స్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments