శ్రీవారి సేవలో రాధికా శరత్‌కుమార్ దంపతులు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీనటులు రాధికా శరత్‌కుమార్ దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శరత్‌కుమార్ మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. నిన్ననే ఆయన్ని పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లానని.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందన్నారు.
శ్రీవారి సేవలో రాధికా శరత్‌కుమార్
Subscribe
Login
0 Comments