ఆర్ట్స్ కాలేజీ ప్రహరీని కూల్చడం సరికాదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాతవాహన వర్సిటీకి నాలుగేళ్లయినా వీసీని నియమించలేదని మండిపడ్డారు. సిద్ధిపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభమైందని అయితే కరీంనగర్లో మాత్రం మెడికల్ కాలేజీకి అతీగతి లేదని విమర్శించారు. టీఆర్ఎస్ను గెలిపించడమే కరీంనగర్ జిల్లా చేసుకున్న పాపమా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కరీంనగర్‌కి మెడికల్ కాలేజీ తీసుకొస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ను గెలిపించడమే పాపం
Subscribe
Login
0 Comments