ప్రముఖ మొబైల్ సంస్థ ఎల్‌జీ గతేడాది డిసెంబర్‌లో ఎల్‌జీ వీ30 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ను రూ.44,990 లతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని ధరను తగ్గించి వినియోగదారులకు తీపి కబురు తెలిపారు. ప్రస్తుతం దీని ధర రూ.41,990 కు నిర్ణయించారు. దాదాపు రూ. 3000 తగ్గినట్లు తెలుస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లోనే అందుబాటులో ఉంది. కంపెనీ తగ్గించిన ధర మాత్రమే కాక, ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ కూడా ఈ ఫోన్‌ కొనుగోలుపై కస్టమర్లకు మరికొన్ని ఆఫర్లను ప్రకటించడం విశేషం.

ఎల్‌జీ వీ30 ప్లస్ ఫీచర్లు చూస్తే..

* 6 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
* 1440×2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 16 మెగాపిక్సెల్‌, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
* 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి .
* 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments