ఎన్టీఆర్ తో కొరటాల

472

రైటర్ గా సినిమా కెరియర్ మొదలు పెట్టిన కొరటాల శివ..ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా స్థానం సంపాదించుకున్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్ అనే నేను ..ఇలా వరుస విజయాలు ఆయన్ను టాప్ కుర్చీలో కూర్చోపెట్టాయి. ప్రస్తుతం ఈయన కోసం అగ్ర హీరోలు , అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎంత టైంయినా తీసుకొని మాతో సినిమా చేయాలంటూ వెంట పడుతున్నారు. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అలాగే ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.

వాస్తవానికి భరత్ అనే నేను తర్వాత ఎన్టీఆర్ తోనే సినిమా చేయాల్సి వుండే, కానీ మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం , దానిని వదులుకోవడం ఇష్టం లేక కొన్ని రోజులు ఎన్టీఆర్ సినిమాను పక్కన పెట్టినట్లు , అలాగే ఎన్టీఆర్ కూడా బిజీ గా ఉండడం తో ముందుగా చిరంజీవి సినిమాను చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడట.

ఎన్టీఆర్‌తో చేసే చిత్రం కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణం లో చేయబోతున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 2019 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ముహూర్తం పెట్టేసాడట. అంతకన్నా ముందు ఈ ఏడాది డిసెంబర్‌లో చిరంజీవి తో సినిమా మొదలు పెట్టి 2019 దసరాకి రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడట. ఇక ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం చేస్తున్న అరవింద ను దసరా బరిలోకి దించి , ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ లో జాయిన్ కావాలని చూస్తున్నాడు. ఈ సినిమా పూర్తీ అయేసరికి కొరటాల సిద్ధంగా ఉంటాడు వెంటనే ఆయనతో సినిమా చేయచ్చు అని ఫిక్స్ అయ్యాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here