బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్ బయటేమో ఇంటి సభ్యుల అందరి కన్నా కౌశల్ కు ఓ సెపరేట్ ఆర్మీ ఏర్పడి అతనికి సపోర్ట్ గా నిలుస్తుంటే ఇంటి లోపల మాత్రం కౌశల్ మీద కుట్రలు జరుగుతూనే ఉన్నాయని అనిపిస్తుంది. సండే ఎపిసోడ్ అందరికి సర్ ప్రైజ్ అయ్యింది. ఎందుకంటే జరిగిన 50 రోజుల ఎపిసోడ్స్ లో ప్రతి వారం ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేస్తుండగా మొదటిసారి ఈసారి ఎలిమినేషన్ బదులు రీ ఎంట్రీ ఓటింగ్ జరిగాయి.ఇక ఎలాగోలా సేఫ్ అనుకున్న ఇంటి సభ్యులు సోమవారం నామినేషన్ ప్రక్రియ అందరిని ఆశ్చర్యపరచింది. ఇంట్లోని తమ స్థానం ఏంటి ఈ గేమ్ గెలిచేందుకు తమని తాము ఏ స్థానంలో ఊహించుకుంటున్నారో ఆ నెంబర్ మీద నిలబడాల్సి ఉంటుంది. అందులో భాగంగా తనీష్ నెంబర్ 1, రోల్ రైడా నెంబర్ 2 నెంబర్స్ మీద నిలబడ్డారు.

అయితే నెంబర్ 3 మీద కౌశల్ నిలబడగా దీప్తి నల్లమోతు కూడా కౌశల్ నెంబర్ మీద కన్నేసింది. ఇంట్లో తాను కూడా ఇదే స్థానంలో ఉన్నానని భావిస్తున్నా అంటూ చెప్పడం విశేషం. కౌశల్ తో కొంతసేపు వాగ్వివాదం చేసుకున్నాక నెంబర్ 3 మీద కౌశల్ తో పాటుగా దీప్తి నిలబడ్డది.

బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం నెంబర్ 6 వరకు నిలబడిన వారు నామినేషన్ నుండి సేఫ్ అవగా 7 నుండి 12 వరకు ఉన్న వారు ఎలిమినేట్ అయినట్టు వెళ్లడించాడు. ఈ క్రమంలో నెంబర్ 7 బాబు గోగినేని, 8 నందిని, 9 గణేష్ లు కూడా నామినేట్ అయ్యారు. 3వ నెంబర్ మీద నిలబడినందుకు దీప్తి, కౌశల్ ఇద్దరు నామినేట్ అయ్యారు. 11వ నెంబర్ గీతా మాధురి, 12వ నెంబర్ పూజా ఒకరు కెప్టెన్ మరొకరు ఇంట్లోకి వచ్చి వారం అవుతున్న కారణం చేత ఇద్దరినీ నామినేట్ చేయలేదు. అయితే కౌశల్ ను కావాలని టార్గెట్ చేశారని కొందరు భావిస్తున్నారు. అయితే లాస్ట్ వీక్ జరిగిన పరిణామాల దృష్ట్యా కౌశల్ ఈసారి స్పోర్టివ్ గా తీసుకుని దీప్తి మీద కామెడీ పంచులు వేశాడు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments