రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని డ్రగ్ కంట్రోల్ డీజీగా నియమించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ అయ్యన్నార్ను రాష్ట్ర శాంతిభద్రతల ఐజీగా నియమించింది. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్‌ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేసింది. అనంతపురం ఓఎ్‌సడీ ఐశ్వర్య రస్తోగీని విశాఖపట్నం జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా బదిలీ చేసింది.
దేవదాయ కమిషనర్‌గా ఎం.పద్మ
దేవదాయశాఖ కమిషనర్ బాధ్యతలను విజయవాడ దుర్గ గుడి ఈవో ఎం.పద్మకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత కమిషనర్ వైవీ అనురాధ మంగళవారం రిటైర్ అవుతున్నారు.