కాలు కదపలేని స్థితిలో పావులమ్మ అనే ఆ ముదుసలి ఓ మూల కూర్చునుంది. ఊరంతా జనంతో జాతరను తలపించేలా ఉంది. ‘ఏమైందర్రా?’ అని ఆ అవ్వ పక్కనున్నవారిని అడిగింది. ‘జగన్‌ వస్తున్నాడవ్వా!’ అన్నారు. ఆ మాట చెవిన పడిన ముదుసలి ఊతకర్రను చేతపట్టింది. ఓపిక తెచ్చుకుని అడుగులు వేసింది. నేరుగా జగన్‌ వద్దకే వెళ్ళి ‘జగన్‌బాబూ! నీవు చల్లంగుండాలయ్యా!’ అని దీవించింది. పెద్దలంటే ప్రాణమిచ్చే జననేత సహజంగానే ‘అవ్వా! బాగున్నావా!’ అని పలకరించారు. ఆ పలకరింపులోని ఆప్యాయతకు పావులమ్మ పులకించిపోయింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments