గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన చిరంజీవి హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి హరిత సవాలు (గ్రీన్‌ ఛాలెంజ్) స్వీకరించారు. తన ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటారు. అనంతరం తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను నామినేట్‌ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమ స్నేహితులను నామినేట్‌ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవిత, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు, దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు, క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా తదితరులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments