తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆ ఎపిసోడ్ లో నాని ఇంటి సభ్యులు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ వారికీ క్లాస్ పీకుతూ చూసే ప్రేక్షకులకు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాడు. బిగ్ బాస్ లో ఇప్పటివరకు ఎలిమినేషన్ జరగటమే కానీ,ఎలిమినేషన్ అయినా వారు మరల హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు ఏమి లేవు. కానీ ఈ సారి బిగ్ బాస్ ఎలిమినేషన్ అయినవారికి ఓటింగ్ పెట్టి అత్యధిక ఓట్లు వచ్చిన పార్టిసిపెంట్ ని హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎలిమినేషన్ అయినా ఆరుగురిలో అత్యధిక ఓట్లను సంపాదించి నూతన్ నాయుడు,శ్యామల ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కరే రీ ఎంట్రీ ఇస్తారని అందరు భావించిన,ఇద్దరికి సమానమైన ఓట్లు రావటంతో ఇద్దరిని హౌస్ లోకి పంపుతున్నట్టు తెలిపారు. అయితే వారిద్దరూ ఎప్పుడు హౌస్ లోకి వస్తారో బిగ్ బాస్ చెపుతారని నాని అన్నాడు. గత వారం ఎలిమినేషన్ ఆపేసారు. దాంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని, ఇద్దరు హౌస్ లోపలకు వెళతారని నాని చెప్పాడు. అయితే బాబు గోగినేని, దీప్తి సునైనా ఈ వారం ఎలిమినేట్ అవుతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments