బీజేపీదే యూటర్న్….టీడీపీది కాదు

580

ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీదే యూటర్న్ తప్ప టీడీపీ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ‘ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం యూటర్న్ కాదా?…మేనిఫెస్టోలో చెప్పింది చేయక పోవడం యూ టర్న్ కాదా?…పదేళ్లు హోదా ఇస్తామని ఇప్పుడు ఇవ్వం అనడం యూ టర్న్ కాదా?’ అంటూ సీఎం ప్రశ్నించారు. రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్‌కు వీజీఎఫ్ సగం తగ్గించారని..అయితే కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌కు రూ.5,361 కోట్లు ఏపీనే కట్టమనడం యూ టర్న్ కాదా? అని చంద్రబాబు నిలదీశారు. ‘ఢిల్లీ-ముంబై కారిడార్‌కు ఒక న్యాయం?…విశాఖ-చెన్నై కారిడార్ కో న్యాయం? ఇది బీజేపీ యూ టర్న్ కాదా?, థొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి…అమరావతికి అన్యాయం చేయడం యూ టర్న్ కాదా?’ అంటూ సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here