కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పోలవరం యాత్రకు వెళ్తున్న బస్సులను టోల్‌ ప్లాజా సిబ్బంది ఆపడంతో తెలుగు దేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. అధికార పార్టీకి చెందిన బస్సులనే ఆపుతారా అంటూ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసి బండబూతులు తిట్టారు. టోల్‌బూతు అద్దాలు ధ్వంసం చేశారు. సిబ్బంది భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి కేసూ లేకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments