చంద్రబాబు తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడైనా పోరాటం చేశారా? అన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చాలా ప్రజా పోరాటాలు చేశారని పేర్కొన్నారు. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైనది మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతిపై చేసిన పోరాటమని అన్నారు. కేవలం జగన్ దురాశ కారణంగానే అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాతి రోజు జగన్ మీడియా సమావేశం పెట్టి చంద్రబాబును విమర్శించారు. చంద్రబాబు తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ పోరాటం చేసి ఎరుగరని విమర్శించారు. జగన్ ఆరోపణలపై స్పందించిన లోకేశ్ ఇలా ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.
జగన్ కు లోకేష్ కౌంటర్
Subscribe
Login
0 Comments