మరో రెండు రోజుల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో నేతలు తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరికీ బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్‌లు ప్రధాన ఆకర్షణగా మారారు. ఇమ్రాన్ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థులు తమ పోస్టర్లలో అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్‌ల బొమ్మలను ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. ఓ స్వతంత్ర అభ్యర్థి అయితే చెత్తకుప్పపై కూర్చుని ప్రచారం చేస్తున్న ఫొటో ఇటీవల ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్లు ఉన్న పోస్టర్ సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది. మరి, అమితాబ్, మాధురీలు ఏ మేరకు ఓట్లు తీసుకొస్తారో చూడాలి!

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments