అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తేజస్వీ మడివాడ ఎలిమినేట్‌ అయింది. అదేంటీ ఎపిసోడ్‌ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్‌లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్‌ ఒక రోజు ముందు షూటింగ్‌ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి తేజస్వీయే ఎలిమినేట్‌ అవుతుందని అందరూ ఊహించినదే.. ఓ టాస్క్‌లో కౌశల్‌తో ప్రవర్తించిన తీరు.. ఆమెపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతను తీసుకురాగా.. కౌశల్‌ను హీరో చేసింది. ఈ దెబ్బతోనే స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అయిన భాను శ్రీ గతవారం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే.

ఇక హౌస్‌ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వీ హౌస్‌మెట్స్‌కు క్లారిటీ ఇచ్చింది. కౌశల్‌ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుని శిక్షించారని, ఇప్పుడు తనువంతు వచ్చిందని, హౌస్‌ నుంచి నిష్క్రమించడానికి లక్ష కారణాలున్నాయని పేర్కొంది. ఈ విషయం శనివారం ఎపిసోడ్‌లో కనిపించింది. ప్రస్తుతం తేజస్వీ ఎలిమినేట్‌ అయిన విషయం సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె బయటకు వచ్చిన అనంతరం అభిమానులు దిగిన కొన్ని ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments