గత ఎన్నికలు గెలిచినప్పటినుండి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయంలో అనేక రకాలుగా మాటలు మారుస్తూ వచ్చిన విషయం తెలిసినదే . ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమని చెప్పి , దాని తరువాత కేంద్రం హోదా ఇవ్వలేమని దానికి సమానంగా ప్యాకేజీ ఇవ్వగలమని తెలుపగానే అలాగేనని ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “హోదా ఏమైనా సంజీవినినా ” అన్న విషయమూ చూశాం . అయితే ఇప్పుడు తాజాగా పార్లమెంట్ సమావేశాలలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యేకహోదా విషయమై దేశ ప్రధానిపై నిప్పులు కురిపిస్తూ చేసిన ప్రసంగం తెలిసినదే .

అయితే ఇప్పుడు ఈ విషయం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ట్విట్టర్లో స్పందించారు . గల్లా జయదేవ్ సంవత్సరం ముందు , ఇప్పుడు ప్రత్యేక హోదా పై మాట మార్చిన విషయాన్ని సూచిస్తూ ఉండే విధంగా స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసి “ఒకవేళ టీడీపీ కి కానీ మతి మరపు ఉంటే “అని టైటిల్ పెట్టారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments