వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , జనసేన అధినేత పవన్ పై తెలుగుదేశం నాయకులు పలు పర్యాయాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసినదే . తాజాగా మరోసారి జగన్ , పవన్ పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి విరుచుకుపడ్డారు . ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై జగన్ , పవన్ లకు కనీస అవగాహన లేదని , జగన్ వీధుల్లో తిరుగుతుంటే , పవన్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు . ఇంకా మాట్లాడుతూ రెండు రోజుల క్రితం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేశారని , చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని అనడం అన్యాయమని అన్నారు . అవాస్తవ హామీలతో తమను మోసగించి ఇలా విమర్శించడం దారుణమని, యూటర్న్ తీసుకుంది చంద్రబాబు కాదు మోదీ అని మండిపడ్డారు . ఏపీ ప్రయోజనాల కోసం తాము చేస్తున్న ధర్మపోరాటం ఎప్పటికీ ఆగదని , ఇచ్చిన హామీలు నెరవేరే వరకు తాము పోరాడుతూనే ఉంటామని అన్నారు . రానున్న ఎన్నికలలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయాల నుండి వైదొలుగుతానని ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments