మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరైనా ఏం చెబుతారు ? గొప్ప డ్యాన్సర్, గొప్ప నటుడు, గ్రేట్ యాక్షన్ హీరో, తెలుగు తెరను శాసిస్తున్న మెగాస్టార్ అని చెబుతారు. కానీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం… చిరంజీవి మోస్ట్ రొమాంటిక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు . తాను నటించిన హీరోల్లో అందరి కంటే ఎక్కువ రొమాంటిక్ చిరంజీవి అని అన్నారు ఆమె . ‘ఖైదీ నంబర్ 150’ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటించిన సంగతి తెలిసిందే .

కాజల్ వ్యాఖ్యలు కుర్ర హీరోలకు షాక్ గురి చేస్తాయని చెప్పక తప్పదు. అంతేకాదు , చిరంజీవికి కూడా ఈ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించేవే . 60 సంవత్సరాలు దాటిన చిరంజీవి ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్నారు . ‘ఖైదీ నంబర్ 150’లో ఆయన చేసిన డ్యాన్సులు ప్రేక్షకులను మైమరపించాయి . వయసు పెరిగినా, తనలో సత్తా మాత్రం తగ్గలేదని చిరు నిరూపించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments