నరేంద్రమోడి సర్కార్ పై తెలుగుదేశంపార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపధ్యంలో చంద్రబాబునాయుడుపై బిజెపి నేత పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడే చంద్రబాబును ఎవరు నమ్ముతారంటూ మండిపడ్డారు. వీగిపోతుందని తెలిసి కూడా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం ద్వారా తెలుగు వాళ్ళ పరువును చంద్రబాబు ఢిల్లీ వీధుల్లో పడేశారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజిపై చంద్రబాబు ఎన్ని సార్లు మాటలు మార్చింది ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.

అసలే చంద్రబాబంటే పురంధేశ్వరికి బాగా మంటన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం దొరికనప్పుడల్లా విరుచుకుపడుతుంటారు. దానికితోడు అవిశ్వాసం తీర్మానం సందర్భంగా చంద్రబాబును లోక్ సభలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి దుమ్ముదులిపేశారు. నిజానికి మోడి ఆ విధంగా మాట్లాడుతారని చంద్రబాబు కూడా ఊహించలేదేమో ? ఎప్పుడైతే మోడి మాట్లాడటం మొదలుపెట్టరో విజయవాడలో చంద్రబాబుకు లోక్ సభలో టిడిపి ఎంపిలకు కత్తివేటుకు నెత్తురు చుక్క లేదన్నట్లైపోయింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments