జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. పవన్‌కల్యాణ్‌కు కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. తోచినట్లుగా ట్వీట్లు పెట్టడమే ఆయన నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన అన్యాయంపై పవన్ ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై పవన్ అనవసర విమర్శలు చేసి రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. పవన్ తన చేష్టలతో స్థాయిని దిగజార్చుకున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ ఎంపీలు మాత్రం ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా గళమెత్తారని అనురాధ ప్రశంసించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments