రాధాకృష్ణకు కవిత ఛాలెంజ్!

811

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణకు ఛాలెంజ్ విసిరారు. హరిత ప్రపంచం కోసం తన వంతు కృషి చేస్తానంటూ మొక్క నాటి.. దానితో ఫొటో దిగిన ఎంపీ కవిత.. ఆ ఫొటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాధాకృష్ణ, సైనా నెహ్వాల్, సినీ దర్శకుడు రాజమౌళికి ‘గ్రీన్’ ఛాలెంజ్ విసిరారు. మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం పచ్చదనంతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఓ యుద్ధంలా స్వీకరించాలని నేతలు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే హరితహారంపై అందరికీ అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వేధికగా ప్రముఖులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ‘ఒక మొక్క నాటండి.. మరో ముగ్గురికి నాటమని చెప్పండి’ అంటూ పిలుపునిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here