కాళేశ్వరం క్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్పించిన చీర మాయమైంది. ఆలయ ఉద్యోగే ఈ చీర మాయం చేశాడని అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన ఉద్యోగి వరంగల్ వెళ్లి అలాంటి మరో చీర కొనుక్కొచ్చి అపహరించిన చీర స్థానంలో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా.. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై ఆలయ చైర్మన్, ఈవో స్పందిస్తూ.. చీర మాయం కాలేదని స్పష్టం చేశారు. కాగా.. 2016 జూన్ 2న అమ్మవారికి కేసీఆర్ దంపతులు చీర సమర్పించారు.