హీరో విజయ్ దేవరకొండ తను చెప్పింది చేసి చూపాడు. ‘అర్జున్ రెడ్డి’ మూవీకి గాను తనకు లభించిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా వచ్చిన సొమ్మును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తానని గతంలో ప్రకటించాడు.

ఇటీవల హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36 లోని ‘జూబ్లీ-800’లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును వేలం వేయగా ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ లేబొరేటరీస్ అధినేత కిరణ్ దివి భార్య శకుంతల దానిని రూ. 25 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ మొత్తానికి చెక్కును విజయ్‌కి అందజేయగా.. దీన్ని విజయ్ తాజాగా. ..సీఎం క్యాంప్ ఆఫీసులో మంత్రి కేటీఆర్‌ను కలిసి అందించారు. తన అవార్డు సొమ్మును విరాళంగా ఇస్తానని ప్రకటించిన విజయ్ దేవరకొండ దాన్ని చేసి చూపాడని అతని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments