హీరో అంటే ఖరీదయిన కార్లలో తిరుగుతూ, బ్రాండెడ్ దుస్తులు వేసుకుంటూ, ఖరీదయిన ఫుడ్ తినేవారు కాదు..తెర ఫై హీరో అయినా సాధారణ వ్యక్తిలాగే తిరుగుతూ, సాధారణ ప్రజల మధ్య ఉంటూ , వారితో ట్రావెల్ చేసే వారే నిజమైన హీరో..అలాంటి హీరోనే ఆర్. నారాయణ మూర్తి.

దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన అత్యంత సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తుంటాడు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించినప్పటికీ తన నిజ జీవితంలో ఎలాంటి ఆర్భాటాలకు, హంగులకు పోరు. సాధారణ వ్యక్తిలాగే ప్రజల్లో తిరుగుతుంటారు. హైదరాబాద్‌లో ఉంటున్న నారాయణ మూర్తి. ఎక్కడికి వెళ్లాలన్నా నడవడానికే ఇష్టపడతాడు. అవసరమనుకుంటే ప్రజలతో పాటే బస్సు, ఆటోలో ప్రయాణిస్తారు. ఊరు ప్రయాణాన్ని కూడా సాధారణ వ్యక్తిలాగా రైల్లో ప్రయాణిస్తుంటారు.తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ వ్యక్తిలా కనిపించి మరోసారి తనకు తానే అనిపించుకున్నారు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న అరుగుపై కుర్చొని ఏదో తింటున్నారు. ఆర్ నారాయణ మూర్తిని చూసిన ప్రయాణికులు ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారంటూ ఈయన్ను మెచ్చుకుంటూ ఆయనతో సెల్ఫీ లు దిగేందుకు పోటీపడ్డారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments