నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 2 విజయవంతంగా 40 ఎపిసోడ్స్ పూర్తి చేసి సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతుంది. గత మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ అనే సినిమా షూటింగ్ జరిగిన సంగతి తెల్సిందే. బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో హౌస్ సభ్యులంతా ఎంతో హుషారుగా పాల్గొని టాస్క్ ను విజయవంతం చేసారు.

ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో పాపులర్ యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. ఎన్నో షోస్‌తో బిజీగా ఉండే మీరు ఇన్నాళ్ళు హౌజ్‌లో ఉండడానికి ఎలా వచ్చారు అని గీతా .. ప్రదీప్‌ని ప్రశ్నిస్తుంది. ప్రదీప్ కూడా వచ్చాడంటే మన షో ఎంత హిట్ అయిందో అర్ధమవుతుందో అని తేజూ అంటుంది. అసలు ప్రదీప్ ఈ బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అసలు కారణం ఏంటో తెలిపి షాక్ ఇచ్చాడు.బిగ్ బాస్ షో తర్వాత మొదలయ్యే పెళ్లి చూపులు అనే షో ప్రమోషన్‌లో భాగంగా తాను హౌజ్‌లోకి వచ్చినట్టు ప్రదీప్ చెప్పాడు. ఈ షో ద్వారా తన లైఫ్ పార్ట్నర్‌ని వెతుక్కోవాలని భావిస్తున్నానని , ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ప్రదీప్. ఈ ప్రోమోలో ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురు కావడం దానికి ప్రదీప్ స్పందిస్తూ.. ‘ఇలా అడుగుతూనే ఉంటారు నేను ఏదో జోక్ చెప్పి తప్పించుకోవడం ఇది రోజూ జరిగేదే. కాఫీ షేర్ చేసుకోవడం కాదురా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఒక్కరికైనా నచ్చుతావ్ గా అని అంటారండీ.. ఇదిగోండి ఇలా పెళ్లికి వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ నువ్వే.. నెక్స్ట్ నువ్వే అంటున్నారండీ.. అందుకే అడక్కుండానే అన్నీ ఇచ్చిన టీవీ నాకొక భాగస్వామిని ఇస్తుందేమో రండి ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం’ అంటూ ప్రదీప్ పెళ్లి చూపులకు ఆహ్వానిస్తున్నారు.

అయితే ప్రదీప్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి రాలేదని అర్ధం అవుతుంది. మరి వైల్డ్ కార్డు ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments