ఇక నో ఫేక్ న్యూస్

1237

ఇటీవల కాలం లో వాట్సాప్ లో ఫేక్ వార్తల ప్రచారం ఎక్కువై పోయిన సంగతి తెల్సిందే. ఈ వార్తల మూలంగా నిజమైన వార్తలను సైతం నమ్మలేని పరిస్థితికి వచ్చాం. ఈ తరుణం లో ఫేక్ వార్తలకు వాట్సాప్ చెక్ పెట్టింది. ఒక సమాచారాన్ని ఐదు కంటే ఎక్కువ సార్లు ఇతరులకు పంపించటానికి వీలు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిబంధన ఫొటోలు, వీడియోలు, సమాచారానికి కూడా వర్తించనుంది.

ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేలా గట్టి చర్యలు చేపట్టాలని వాట్సాప్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆ చర్యలను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఒకే వార్త కానీ వీడియో , ఫోటో ఏదయినా సరే ఐదు సార్ల కంటే ఎక్కువగా సార్లు పంపకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.”ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారుల్లో కేవలం భారత్ లోనే ఎక్కువ మంది.. తమకు వచ్చిన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి మేం సరికొత్త ప్రయోగం చేపట్టబోతున్నాం. ఒక సమాచారాన్ని ఐదు కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్ చేసే అవకాశం లేకుండా చేస్తున్నాం. తర్వాత ఫార్వర్డ్ సింబల్ ను తొలగించనున్నాం” అని వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here