మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. సుజాతను అసభ్యకరంగా దూషిస్తూ ఓ వ్యక్తి ‌ ఫేస్‌ బుక్‌ లో పోస్టులు పెట్టాడు. వీటిని చూసిన ఆమె అనుచరుడు వీరేంద్ర, చింతలపూడి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments