బిగ్ బాస్ 2 తెలుగు లవ్ స్టోరీస్

813

బిగ్ బాస్ మొదటి సీజన్ అంతా సరదా సరదాగా సాగింది. అయితే బిగ్ బాస్-2 అలా కాదు ఇప్పటికి హౌజ్ మెట్స్ లో ఒకరంటే ఒకరికి పడని విధంగా పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నాని ఏదైనా జరగొచ్చు.. మరింత మసాలా అని చెప్పినట్టుగా రెండు జంటలు బిగ్ బాస్ హౌజ్ లో నానా హంగామా చేస్తున్నాయి.

సామ్రాట్, తేజశ్వి.. తనీష్, దీప్తి సునైనా ఇలా రెండు ప్రేమ జంటలు, జంట పక్షులుగా బిగ్ బాస్ హౌజ్ లో ఉంటున్నారు. దీప్తి సునైనా విషయంలో భాను శ్రీ కాస్త చొరవ తీసుకుని తనీష్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయబోగా అది నా పర్సనల్ అని చెప్పేసిందట. సో తనీష్ విషయంలో దీప్తి సీరియస్ గానే ఉందని చెప్పొచ్చు.

ఇక మరో పక్క నాని కూడా రెండు వారాలుగా సామ్రాట్ తో మాట్లాడకుండా తేజశ్వితో మాట్లాడా కదా నీతో మాట్లాడేముంది అంటూ దాట వేశాడు. దాని అర్ధం సామ్రాట్ కనిపిస్తే తేజశ్వితో తప్ప సెపరేట్ గా కనిపించడం లేదు. అందుకే ఈ వారం నామినేషన్ లో ఉన్న అతను ఎలిమినేట్ అయినా అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.

ఏది ఏమైనా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ప్రేమ పక్షులకు వేదికగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో యాంకర్ ప్రదీప్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన పెళ్లి చూపుల వేదికగా బిగ్ బాస్ ను ఎంచుకున్నాడు ప్రదీప్. తనని అమితంగా ఇష్టపడే పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here