తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం లో క్షేత్ర రక్షకురాలుగా కొలవ బడుచున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆలయ అర్చకులు బులుసు సుబ్రహ్మణ్య శర్మ , పురోహితులు అంగర సతీష్ శర్మ , కొంపెల్ల మూర్తి శర్మ , పెండ్యాల లక్ష్మీ నారాయణ శర్మ, వేద పండితుల ఆధ్వర్యంలో ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి అనంతరం 13 అధ్యాయాల చండీ సప్తశతి హోమాన్ని నిర్వహించారు.
ప్రతీ అధ్యాయానికి చివరలో వివిధ రకముల సుగంధ భరిత పుష్పములు ఫలములు పసుపు కుంకుమ అగ్ని హోత్రునికి సమర్పించారు. అనంతరం పూర్ణాహుతి ఘట్టాన్ని పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఈరంకి జగన్నాధరావు, మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందచేశారు.
చండీ హోమం గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చుడండి.