నితిన్ .. రాశి ఖన్నా జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా నుంచి రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా ఆడియో వేడుక కోసం కూడా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆడియో వేడుక ఎప్పుడనే విషయాన్ని టీజర్ ద్వారానే తెలియజేస్తారట. వివాహ బంధంలోని గొప్పతనాన్ని చాటిచెప్పే కథాకథనాలతో ఈ సినిమా కొనసాగనుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. సీనియర్ నరేశ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments