దేశానికి ఉపయోగపడే విధంగా యువత తయారవ్వాలంటే కొన్ని పద్ధతులను పాటించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని, మీ మెదడును మీ కంట్రోల్ లోనే ఉంచుకోవాలని సూచించారు.టీవీలో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో చూడటం కోసం యువత ప్రతి రోజు 2 గంటల సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ షో మొత్తం బిగ్ బాస్ చెప్పినట్టు నడుస్తుంటుందని… అందరి మైండ్ లను బిగ్ బాస్ కంట్రోల్ చేస్తుంటాడని, బిగ్ బాస్ ను మాత్రం ఎవరూ కంట్రోల్ చేయరని అన్నారు. మన మైండ్ ను మనమే కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాణాయామం చేయాలని సూచించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments