పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అప్పుడే రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ నేతలు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని… రాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని… ఆయన కుమారుడు నారా లోకేష్ కు ఇంగ్లీషే కాదు, తెలుగు మాట్లాడటం కూడా రాదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు సీఎం రమేష్ లాంటి వారిని పార్లమెంటుకు పంపిస్తే… ఆయన ఏమి అర్థం చేసుకుంటారని, ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments