ఎన్నికల సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక నుంచి జనం మధ్యే గడపనున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ గ్రామదర్శిని-గ్రామ వికాసం అనే సరికొత్త కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వారంలో 3 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, మిగతా 3 రోజులు సచివాలయంలో ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళ, బుధ వారాలు సచివాలయానికి కేటాయించి.. ఆదివారం తప్ప మిగతామూడు రోజులు గ్రామదర్శినిలో పాల్గొంటూ జనం మధ్యే ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల పాటు ఇది జరగనుంది. ‘ఈ రోజుతో ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు పూర్తయ్యాయి. గ్రామ దర్శిని – గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా అధికార యంత్రాంగం ప్రజల్లోకి వెళ్లాలి’’ అని సీఎం ఆదేశించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments