టీడీపీ పాలనకు చరమ గీతంపాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పరవాడ మండలం సాలాపువానిపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ మాట్లాడుతూ చంద్రబా బు పాలనతో విసిగిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ నియోకవర్గ ఇన్‌చార్జ్‌ వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు  పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, సామాన్యులు దగా పడ్డారన్నారు. పెందుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు టీడీపీతో విసిగిపోయి తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments