రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇవాళ ఇందిరా భవన్‌లో జరిగిన గ్రేటర్ కాంగ్రెస్ నాయకుల సమావేశం రసాభసగా మారింది. అజహరుద్దీన్ వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అనుచరులు ఆందోళనకు దిగారు. చేతనైతే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని అజహరుద్దీన్‌కు అంజన్ కుమార్ యాదవ్ సూచించారు. అంజన్ కుమార్ అనుచరలు ఆందోళనకు దిగడంతో వారికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ సర్దిచెప్పారు. అయితే సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా వి. హనుమంతరావు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments