బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన వివిధ క్షేత్రాల రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశంలో ఆయన నోట ఆదిలాబాద్ జిల్లా ప్రస్థావన రావడం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర స్థాయిలో గెలుపొందే 11 అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్ నియోజక వర్గం ప్రథమ స్థానంలో ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. మహారాష్ట్రతో సత్సంబంధాలు కలిగి ఉండే ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేయడం ఆ పార్టీ వర్గాల్లో మరింత నూతనుత్తేజాన్ని నింపుతోంది. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నేతలంతా కలిసి కట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.