అక్టోబర్ లో ఆరంభం …

623

బాహుబలి వంటి చిత్రాన్ని రూపొందించి ప్రపంచ స్థాయికి తెలుగు సినీ పరిశ్రమను తీసుకెళ్లారు రాజమౌళి . బాహుబలి 2 విడుదలైన చాలా రోజుల తరువాత తాను యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ . మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి తాను మల్టీస్టారర్ చేయబోతునట్టు ప్రకటించారు జక్కన్న . ఆ ప్రకటన వెలువడిన తరువాత ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు . అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది . ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్లో ప్రారంభించనున్నారట . ప్రస్తుతానికి ఈ చిత్రానికి “ఆర్ఆర్ఆర్” అనే వర్కింగ్ టైటిల్ గా ఉంది . ఈ చిత్రాన్ని డీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు .

ప్రస్తుతానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీరరాఘవ ” తో ఎన్ఠీఆర్ , బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సినిమాతో రాంచరణ్ బిజీ గా ఉన్నారు . ఆ సినిమాల చిత్రీకరణ అనంతరం వారిద్దారూ చిత్రీకరణలో పాల్గొననున్నారు . వీఎఫ్‌ఎక్స్‌ ఎక్కువగా ఉండే ఈ సినిమా షూటింగ్ , రిలీజ్‌కు రెండేళ్లు పట్టనుందని సమాచారం . 2020లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్‌కుమార్‌ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here