తనపై వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా  కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే జోడె ప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ మేరకు రోజా తరపు హైకోర్టు న్యాయవాది సుధాకర్ రెడ్డి , పెనమలూరు పోలీసు స్టేషన్ కు వచ్చి జోడె ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబందించిన సీడీని పోలీసులకు అందించారు . ఓ ఎమ్మెల్యే గా ఉంటూ ప్రసాద్ అనాలోచిత వ్యాఖ్యలు చేశారని , ఆయన బాష అతి దారుణంగా ఉందని , ఇది రాజ్యరంగానికి విరుద్ధమని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు . ఆపై పోలీసు స్టేషన్ ముందు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సీడీని అందుకున్న విషయాన్ని స్పష్టం చేసిన పెనమలూరు సీఐ రామోదర్ రావు, ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments