కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు . తన అన్నో , తమ్ముడో ముఖ్యమంత్రి అయినట్టు తన పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారని చెప్పారు . అయితే, సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయని అన్నారు . కుమారస్వామి ముఖ్యమంత్రి అయినందుకు జేడీఎస్ నేతలు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన కుమారస్వామి బొకేలు తీసుకోవడానికి , పూలదండలు వేయించుకోవడానికి నిరాకరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు . కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను . అది విషం కంటే ఏమీ తక్కువ కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను . ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను’’ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు .

ఎన్నికల ప్రచారం సందర్భంగా తానెక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని , అదేమీ అదృష్టమో కానీ తన పార్టీ సభ్యులకు మాత్రం ఓట్లు వేయడాన్ని మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు . ‘‘దేవుడైతే నాకీ అధికారం (సీఎం పదవి) ఇచ్చాడు . నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు’’ అని కుమారస్వామి పేర్కొన్నారు .

మరోవైపు, కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడి ఆరోగ్యం గురించి కలత చెందుతున్నారు . విశ్రాంతి లేకుండా ఏకదాటిగా 18 గంటలు పనిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు . ఇప్పటికే కుమారస్వామి ఆరోగ్యం అంతంత మాత్రమే కావడంతో ఈ ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని విచారిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments