వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిలాలో కొనసాగుతున్న విషయం తెలిసినదే . ఈరోజు పెద్దపూడి మండలం మామిడాల నుండి పాదయాత్ర ప్రారంభం కావలసి ఉండగా అంతరాయం ఏర్పడింది . ఆ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా జోరు వాన కురుస్తుండడంతో పాదయాత్ర చేయలేని పరిస్థితి . అయినా కూడా తన కోసం వచ్చిన ప్రజలను పలకరించి జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు . వర్షం తగ్గుముఖం పట్టిన తరువాత పాదయాత్ర తిరిగి కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments